Share News

విషాదం.. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:20 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

విషాదం.. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!
Parvathipuram Manyam

పార్వతీపురం మన్యం, జనవరి 23: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. జియ్యమ్మ వలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన మధు, సత్యవతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ గత రాత్రి ఆ కుటుంబ సభ్యులంతా పురుగుల మందు సేవించి బలవర్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. మధు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడిఉన్నారు.


ఈ ఘటనలో మీనక మధు(35), అతని భార్య సత్యవతి(30), వారి కుమారుడు మోష(4) మృతి చెందగా.. కుమార్తె ఆయోష పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులా? లేక మరే ఇతర కారణాల వల్ల ఆ కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడింది? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 01:04 PM