Brahmani Birthday: బ్రాహ్మణి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన నారా లోకేష్
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:39 PM
ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణి భర్త నారా లోకేష్.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమపూర్వకమైన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్ట్ చేశారు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తన భార్య నారా బ్రాహ్మణికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (డిసెంబర్ 21)న నారా బ్రాహ్మణి బర్త్డే. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు.
'హ్యాపీ బర్త్‌డే బ్రాహ్మణి! కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ప్రశాంతతలోనూ, గందరగోళంలోనూ నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావ్. దేవాన్ష్‌కు ప్రేమమయమైన తల్లివి, ఒక రాక్‌స్టార్ సీఈఓవి, ప్రతి అడుగులో నాతో నడిచావు. ఎప్పటికీ కృతజ్ఞుడిని.' అంటూ తన ప్రేమపూర్వక సందేశాన్ని బ్రాహ్మణికి ఇచ్చారు నారా లోకేష్. ఈ సందేశం ద్వారా లోకేష్.. భార్యపై ఉన్న ప్రేమ, కృతజ్ఞతను చాటిచెప్పారు. ఈ పోస్ట్‌తో పాటు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వారి ఫొటోను జతచేశారు లోకేష్.
నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంగళగిరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి. బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ సీఈఓగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దేవాన్ష్. బ్రాహ్మణి బర్త్ డే వేళ అభిమానులు, రాజకీయ కార్యకర్తలు బ్రాహ్మణికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
'హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు', 'పుట్టిన రోజు శుభాకాంక్షలు వదినమ్మ' వంటి కామెంట్లు చేస్తున్నారు. బ్రాహ్మణికి మరిన్ని విజయాలు, సంతోషాలు కలగాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...
ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...
Updated Date - Dec 21 , 2025 | 09:07 AM