Share News

Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Dec 12 , 2025 | 07:17 AM

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Duvvada Madhuri Srinivas

హైదరాబాద్, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌కి (Duvvada Madhuri Srinivas) బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(JBIET) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముకులు హాజరైనట్లు సమాచారం.


ఈ క్రమంలో బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్క బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ

ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 07:34 AM