PM Modi 75th Birthday: మోదీ పుట్టినరోజున బిహార్‌లో చలో జీతే హై చిత్ర ప్రదర్శన
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:01 PM
హిందీలో రూపొందించిన 'చలో జీతే హై' షార్ట్ ఫిల్మ్‌కు మంగేష్ హడవాలే దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం 2018 జూలై 11న విడుదలైంది.
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 17న తన 75వ పుట్టినరోజు (75th Birthday) జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) ప్రత్యేకంగా సేవా పక్వాడ పేరుతో దేశవ్యాప్తంగా 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకూ సేవాకార్యక్రమాలు నిర్వహించనుంది. బిహార్ బీజేపీ యూనిట్ మోదీ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరుపుకోనుంది. ప్రధానమంత్రి బాల్యం నేపథ్యంలో రూపొందిన 'చలో జీతే హై' (Chalo Jeete Hai) చిత్రాన్ని రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజవర్గాల్లో బుధవారంనాడు ప్రదర్శించనుంది. దీనితో పాటు రెండువారాల సేవాపక్వాడ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు, క్లీన్లీనెస్ డ్రైవ్, పీఎం మోదీ సాధించిన విజయాలపై ఎగ్జిబిషన్, చర్చాగోష్టులు నిర్వహించనుంది.
ఎల్‌ఈడీలతో 243 వాహనాలు రెడీ
ప్రధాని మోదీ బాల్యం నేపథ్యంలో రూపొందిన 'చలో జీతా హై' చిత్రాన్ని ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా (Bihar) ప్రదర్శించనున్నట్టు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందుకోసం ఎల్‌ఈడీలు అమర్చిన 243 వాహనాలను సిద్ధం చేశామని చెప్పారు. 'ఇది కేవలం సినిమా కాదు, ప్రధాని బాల్యానికి చెందిన వాస్తవచిత్రం. పేదరికాన్ని ఆయన చూశారు. తన తల్లి వేరేవాళ్ల ఇళ్లలో పాత్రలు తోమడం, ఎంతో కష్టపడటం చూశారు. పేద ప్రజల బాధలేమిటో ఆయనకు బాగా తెలుసు' అని నిత్యానంద రాయ్ చెప్పారు.
హిందీలో రూపొందించిన 'చలో జీతే హై' షార్ట్ ఫిల్మ్‌కు మంగేష్ హడవాలే దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం 2018 జూలై 11న విడుదలైంది. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి