Share News

Dangerous stunt: ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:34 PM

ముఖ్యంగా కొందరు వ్యక్తులు చేసి రిస్కీ స్టంట్‌లకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఇద్దరు మహిళల ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dangerous stunt: ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
dangerous stunt by women

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు చేసి రిస్కీ స్టంట్‌లకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మహిళల ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (shocking viral video).


VishalMalvi_ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముగ్గురు మహిళలు తమ ప్రాణాలకు తెగించి మరీ కదులుతున్న రైలును ఎక్కేశారు. రైల్వే గేట్ దగ్గర కొన్ని వాహనాలు ఆగి ఉన్న సమయంలో ముగ్గురు మహిళలు రైలు ట్రాక్ పక్కన నిల్చున్నారు. రైలు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోంది. అయినా సరే ఆ మహిళలు ప్రమాదం గురించి ఆలోచించకుండా ఒకరి తర్వాత ఒకరు రైలు ఎక్కేశారు. ఆ మహిళలు చేసేది చూసి అందరూ ఆశ్చర్యపోయారు (dangerous stunt by women).


ఒకరు ఆ మహిళ ప్రమాదకర స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (women risky behavior video). ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5.7 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. భారతదేశంలో ప్రారంభకుల కోసం కాదని ఒకరు కామెంట్ చేశారు. వీళ్లు మృత్యువుతో ఆటలాడుకుంటున్నారు. వాళ్లు ఫిజిక్స్‌ను బాగా అప్లయ్ చేశారని మరొకరు మెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2025 | 04:35 PM