National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:15 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది.
ఢిల్లీ, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్తగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ఏ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారిస్తున్నారని ప్రశ్నించింది. కేవలం ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నిందితులు ఈ దశలో ఎఫ్ఐఆర్ కాపీని పొందేందుకు అర్హులు కారని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.
ఈ కేసు బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ సమన్ల ఆదేశాలసారంగా పరిగణనలోకి తీసుకున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్ నుంచి కాదని ఈ క్రమంలో విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి