LVM3 M6 Rocket: ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:39 PM
సతీశ్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన మరో అతిపెద్ద LVM3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేశారు.
నెల్లూరు, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): సతీశ్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన మరో అతిపెద్ద LVM3 M6 బాహుబలి రాకెట్ (LVM3 M6 Baahubali Rocket) ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేశారు. 24న ఉదయం 8:54గంటలకి LVM3 M6 బాహుబలి రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. LVM3 M6 బాహుబలి రాకెట్ ఎత్తు - 43.5మీటర్లు, బరువు 6400 మీటర్లు ఉండగా.. ఈ రాకెట్ ప్రయోగ సమయం 15నిమిషాల 7 సెకన్లు ఉండనుంది.
అమెరికాకు చెందిన బ్లూ బార్డ్ బ్లాక్ - 2 శాటిలైట్‌ని నింగిలోకి మోసుకెళ్లనుంది బాహుబలి రాకెట్. శాటిలైట్ బరువు 6100కిలోలు ఉంది. ఈ శాటిలైట్‌ని అమెరికాకి చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. గతంలో పంపిన శాటిలైట్ల కంటే పదిరెట్లు అధిక సామర్థ్యంతో బ్లూ బార్డ్ బ్లాక్ - 2 శాటిలైట్ పనిచేయనుంది.
LVM3 రాకెట్ సిరీస్‌లో ప్రస్తుతం ఎనిమిదో ప్రయోగం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్ -3 ప్రయోగానికి LVM3 రాకెట్‌ని ఇస్రో వినియోగించనుంది. ఈ నేపథ్యంలో షార్‌కి ఇస్రో చైరన్ డాక్టర్ నారాయణన్, అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. LVM3 M6ప్రయోగం పూర్తి వాణిజ్య ప్రయోగంగా తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలకి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో షార్‌లో CSF జవాన్లు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
ఇవీ చదవండి:
బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు