Home » ISRO
రెండు వరుస వైఫల్యాల తర్వాత అద్భుత విజయంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా చేపట్టిన ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది.
ఇస్రో తాజాగా నిర్వహించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇది భారతదేశపు పెరుగుతున్న అంతరిక్ష సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ సక్సెస్ కావడం తొలి విజయమని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలను నిర్వహిస్తామని తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది.
భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ప్రయోగం జరగనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (EOS-05) ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4, 2026న తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగించనుంది.
నెల్లూరు శ్రీహరికోటలో ఈ నెల 4న జరగనున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ సూళ్లూరుపేటలోని గ్రామదేవత శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.