Share News

Aditya L1: సూర్యుడికి మేం నమస్కరించాం.. ఇస్రో విజయం పై ప్రధాని మోదీ ట్వీట్..

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:57 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలోకి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్వీట్ చేసి తెలిపారు.

  Aditya L1: సూర్యుడికి మేం నమస్కరించాం.. ఇస్రో విజయం పై ప్రధాని మోదీ ట్వీట్..

బెంగళూర్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. సూర్యుడిని (Sun) అధ్యయనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తుది కక్ష్యలోకి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్వీట్ చేసి తెలిపారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. భారతదేశం మరో మైలురాయిని చేరిందని ప్రకటన చేశారు.

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో గల లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1ను శాస్త్రవేత్తలు పంపించారు. అక్కడ సూర్యుడిని (Sun) నిరంతరం పర్యవేక్షిస్తోంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదేననే సంగతి తెలిసిందే.

గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగం చేపట్టారు. వ్యోమనౌక ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కీలక సమాచారాన్ని ఆదిత్య ఎల్1 (Aditya L1) అందించనుంది.

Updated Date - Jan 06 , 2024 | 04:58 PM