Share News

Chandrayaan-3: అరుదైన ఘనత.. దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకున్న విక్రమ్..

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:01 PM

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్‌ కు లేజర్ కిరణాలను పంపింది.

Chandrayaan-3: అరుదైన ఘనత.. దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకున్న విక్రమ్..

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్‌ కు లేజర్ కిరణాలను పంపింది. వాటిని విక్రమ్ లోని ఓ పరికరం విజయవంతంగా అందుకోవడంతో ఈ ఘనత సాధించింది. తద్వారా చంద్రునిపై వస్తువులను గుర్తించడానికి కొత్త మార్గం ఏర్పడింది. ఈ విషయాన్ని నాసా, ఇస్రోలు వెల్లడించాయి. ఈ ప్రయోగం కోసం కేవలం 20 గ్రాముల బరువున్న ఎల్‌ఆర్‌ఏను నాసా విక్రమ్‌పై ఉంచింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ లేనందువల్ల ఎలాంటి నిర్వహణ లేకపోయినా దశాబ్ధ కాలం సేవలందిస్తుంది. తాజా ఘనతతో విక్రమ్‌లోని ఏడు పేలోడ్‌లు, ప్రజ్ఞాన్ రోవర్‌ లోని రెండు పరికరాలు దిగ్విజయంగా తమ పనిని పూర్తి చేసుకున్నాయి.

చంద్రుని కక్ష్య నుంచి ఉపరితలంపై మన రెట్రో రిఫ్లెక్టర్‌ను గుర్తించగలిగాం. తదుపరి దశ సాంకేతికతను మెరుగుపరచడం, తద్వారా భవిష్యత్తులో ఈ రెట్రో రిఫ్లెక్టర్‌లను ఉపయోగించాలనుకునే మిషన్‌లకు ఇది సహాయపడుతుందని నాసా ప్రకటనలో వెల్లడించింది. చంద్రునిపై పని చేస్తున్న ఎల్ఆర్ఏ ఇది మాత్రమే మొదటిది కాదు. అపోలో మిషన్ల ద్వారా ఇలాంటి సాంకేతికతను గతంలోనూ ఉపయోగించారు. అయితే.. ఎల్ఆర్ఏ ఆన్‌బోర్డ్ విక్రమ్ అన్నింటిలో అతి చిన్నది. అత్యంత అధునాతనమైనది. ఇది చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో మాత్రమే అందుబాటులో ఉంది.

Updated Date - Jan 20 , 2024 | 01:01 PM