Home » Andhrajyothi
మన జీవిత పుస్తకంలో ‘చార్ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...
పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి, ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు.
తన ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. వార్తాపత్రికలను ఒకదానిపై ఒకటి అంటిస్తూ మందమైన గోడలను తయారుచేశారు. గోడలు అర అంగుళం మందంతో ఉండేలా చూశారు. ప్రతీ రోజూ మూడు పేపర్లు ఇంటికొచ్చేవి. కొన్నిపేపర్లు స్నేహితులు, బంధువులు తీసుకొచ్చి ఇచ్చారు.
పెళ్లి కుదరగానే... ఏ చీర కట్టుకోవాలి? ఏ నగ వేసుకోవాలి? మేకప్ ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ వధువును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కళ్లజోడు ధరించే వధువులకు ఈ ఆందోళన, ఒత్తిడి కాస్త రెట్టింపవుతుంది. కళ్లజోడుతోనే ఉండాలా? లెన్స్ పెట్టుకోవాలా? అని సందిగ్ధంలో పడిపోతారు. అయితే క్రమక్రమంగా పరిస్థితులు మారుతున్నాయి.
ఓ గ్రామీణ యువతి సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ పొట్టు, ఎండు గడ్డి, మొక్క జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలతో దుస్తులను రూపొందిస్తుంది. అల్లికలు, కుట్టడం, గమ్‌తో అంటించడం ద్వారా వీటిని తయారుచేస్తోంది. వేరుశనగ పొట్టుతో ఓ ఫ్రాక్ను తయారుచేసి, రెడ్ బీన్స్‌తో టై కట్టేసింది.
విరామం దొరికితే చాలు... రిషికేశ్‌లో వాలిపోతా... అంటున్నారు ప్రముఖ హీరోయిన్గా సంయుక్త మీనన్. నాలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువని, ‘చిన్మయ విద్యాలయ’లో చదవడంవల్ల చిన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకున్నా.. అంటున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిది. పేరు.. ‘ది అమెరికన్ డ్రీమ్’. నిజానికి ఈ కారును 1986లోనే తయారుచేశారు. కాలిఫోర్నియాకు చెందిన కార్ కస్టమైజర్ జే ఓర్బెర్గ్ దీన్ని రూపొందించారు. సాధారణ కార్లు 12 నుంచి 16 అడుగుల పొడవు ఉంటాయి. కానీ జే ఈ కారును ప్రత్యేకంగా 26 చక్రాలు, 18.28 మీటర్ల (60 అడుగులు) పొడవుతో రూపొందించారు.
ఒక ద్రవ్యంలోని విటమిన్లు మినరల్స్, ఇతర రసాయనాలే దానికి వగరూ, తీపీ లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుకుర్బి టాసిన్ గ్లైకోసైడ్స్ చేదు రుచిని ఇచ్చి, స్థూల కాయాన్ని, షుగర్‌ని తగ్గించి పోషణనిస్తుంది. కాకరకాయ బిట్టర్ టానిక్ అందుకే! పసుపులో ఉండే కర్కుమిన్ దానికి వగరు రుచినిస్తోంది.
వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే రహదారి అది. రోడ్డు మధ్యలో ఒక చోట డివైడర్ దగ్గర చూస్తే ఇనుప రెయిలింగ్స్ కనిపిస్తాయి. కాస్త దగ్గరగా వెళితే... భూగర్భంలోకి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. లోపలకు దిగి చూస్తే సకల సదుపాయాలతో ఉన్న హోటల్ స్వాగతం పలుకుతుంది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా నలుగురితో కలిసి కాలు కదిపితే... మనసుతో పాటు శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగు తుంది. ఒక లయబద్ధంగా చేసే ‘లైన్ డ్యాన్స్’ మెదడులోని హిప్పోకాంపస్‌ను చురుగ్గా మారుస్తుంది. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ.