డిజిటల్ యుగంలో ప్రేమ (పద) బంధాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 08:12 AM
ఎమోజీలే తప్ప, ఎమోషన్స్ కనిపించని కాలమిది. ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమ బంధాలు ఎంతగా మారుతున్నాయో, అంతే వేగంగా ఆ ప్రేమను వ్యక్త పరిచే పదబంధాలూ మారుతున్నాయి.
నేడు ప్రేమికుల దినోత్సవం
హైదరాబాద్ సిటీ: ఎమోజీలే తప్ప, ఎమోషన్స్ కనిపించని కాలమిది. ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమ బంధాలు ఎంతగా మారుతున్నాయో, అంతే వేగంగా ఆ ప్రేమను వ్యక్త పరిచే పదబంధాలూ మారుతున్నాయి. ప్రేమలో ఉన్న వారెవరైనా సరే ఈ భాషల్లో ఏదో ఒకటి వాడాల్సిందే అని చెబుతోంది జెన్ జి తరం. డిజిటల్ యుగంలో ఆచరిస్తున్న కొన్ని ప్రేమ(పద) బంధాలను చూస్తే...
గ్రీన్ డేటింగ్: పర్యావరణం పట్ల అమిత ప్రేమ కలిగిన నవతరంలో కొంతమంది తమ ప్రేమ జీవితాల్లోనూ దానిని జోడిస్తున్నారు. తమ డేట్స్ కూడా పర్యావరణ హితంగానే ఉండాలనుకుంటున్నారు. గ్రీన్ డేటింగ్ అంటూ తమ పర్యావరణం, ప్రేమికులపై ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.
సిట్యుయేషన్‌షిప్: తమది ప్రేమ అవునో, కాదో కూడా చెప్పలేని గందరగోళపు స్థితి కలిగిన ప్రేమికులనే సిట్యుయేషన్ లవర్స్‌గా చెబుతున్నారు. ఆ ప్రేమను సిట్యుయేషన్‌షి్‌ప అని అంటున్నారు.
బ్రెడ్ క్రంబింగ్: ఏదో విధంగా అవతలి వారిని ఆకర్షించాలని చేసే ప్రయత్నాలను బ్రెడ్ కంబింగ్ అంటున్నారు.
సింపింగ్: అధిక శ్రద్ధ, కేర్ తీసుకోవడమే సింపింగ్.
అఫోర్డేటింగ్: కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే డేటింగ్‌లలో ఇది ఒకటి. అందుబాటు ధరలలో డేట్‌కు వెళ్లటాన్ని ఇష్టపడే వారు ఈ అఫోర్టేడింగ్ ఇష్టపడుతున్నారు.
బెంచింగ్: ఇదో ప్రమాదకరమైన ప్రేమ పద్ధతి. ఒకరితో ప్రేమలో ఉంటారు. ఇంకొకరి కోసం అన్వేషిస్తూనే ఉంటారు.
లవ్ లోరింగ్: ప్రేమ లేదని, ప్రేమించ రాదని... అంటూ విరహ గీతాలు పాడుకుంటూనే నూతన ప్రేమ కోసం వెదకులాడే సింగిల్స్ నడుమ కొనసాగుతున్న ధోరణి ఇది.
పాకెటింగ్: కావాలనే మిమ్మల్ని తమ వారికి దూరం పెడితే దానిని పాకెటింగ్ అంటున్నారు. అంటే, మీతో ప్రేమలో ఉంటారు. కానీ, అది రహస్యంగానే ఉండాలనుకోవడం.
హార్డ్ బాలింగ్: ప్రేమలో నిజాయితీ కోరుకుంటే హార్డ్ బాలింగ్‌గా చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News