ఆటలు సాగేది ఇక్కడే!
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:05 AM
వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు.
వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు. అవి నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్), వాంఖడే స్టేడియం (ముంబై), అరుణ్ జైట్లీ స్టేడియం (న్యూఢిల్లీ), ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై), ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (కొలంబో), పల్లెకెలె స్టేడియం (క్యాండీ).
1.నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) :
సామర్థ్యం : 1,32,000
అత్యధిక స్కోరు : 234/4
అత్యల్ప స్కోరు : 44 ఆలౌట్
అత్యధిక ఛేదన : 166/3
అద్భుతంగా నిర్మించిన ఈ వేదికలో ఫైనల్ (పాక్ ఫైనల్‌కు రాకుంటే) సహా ఏడు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 11 అంతర్జాతీయ టీ20లు నిర్వహించారు.. వీటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఏడు మ్యాచ్‌లు, మొదట బౌలింగ్ చేసిన జట్లు నాలుగు మ్యాచ్‌లు నెగ్గాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.
2.ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా :
సామర్థ్యం : 63 వేలు
అత్యధిక స్కోరు : 201/5
అత్యల్ప స్కోరు : 70 ఆలౌట్
అత్యధిక స్కోరు ఛేదన : 162/4
ఈ స్టేడియంలో సెమీఫైనల్-1 సహా ఏడు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్థాన్ కనుక సెమీ్‌సకు చేరితే కోల్‌కతాలో జరగాల్సిన సెమీ్‌స-1ను కొలంబోకు తరలిస్తారు. ఈ వేదికలో 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు, ఎనిమిదిసార్లు మొదట బౌలింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఫ్లాట్ వికెట్ కావడంతో పెద్ద స్కోర్లు నమోదవుతాయి. పేస్, బౌన్స్‌కూ పిచ్ అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగుతున్నకొద్దీ స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది.
3.ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై :
సామర్థ్యం : 50 వేలు
అత్యధిక స్కోరు : 189/4
అత్యల్ప స్కోరు : 80 ఆలౌట్
అత్యధిక స్కోరు ఛేదన : 182/4
ఇక్కడ ఏడు ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ వేదికపై 10 టీ20లు ఆడితే..మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గాయి. తొలుత బౌలింగ్ చేసిన జట్లు కేవలం మూడు మ్యాచ్‌లే గెలుపొందాయి. వికెట్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. రివర్స్ స్వింగ్‌తోపాటు వైవిధ్యభరిత బంతులు వేస్తే పేసర్లు కూడా రాణించగలరు.
4. అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ :
సామర్థ్యం : 48 వేలు
అత్యధిక స్కోరు : 221/9
అత్యల్ప స్కోరు : 120 ఆలౌట్
అత్యధిక స్కోరు ఛేదన : 212/3
మెగా టోర్నీలో ఇక్కడ ఆరు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటిదాకా ఇక్కడ 14 టీ20లు జరగ్గా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఐదు, తొలుత బౌలింగ్ చేసిన జట్లు తొమ్మిదిసార్లు విజయం అందుకున్నాయి. పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.
5.వాంఖడే స్టేడియం, ముంబై :
సామర్థ్యం : 33 వేలు
అత్యధిక స్కోరు : 247/9
అత్యల్ప స్కోరు : 135/7
అత్యధిక స్కోరు ఛేదన : 230/8
సెమీఫైనల్-2 సహా ఎనిమిది వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. 13 టీ20 మ్యాచ్‌లు జరిగితే..మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు, తొలుత బౌలింగ్ చేసిన జట్లు ఏడు మ్యాచ్‌లు నెగ్గాయి. సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల ఆరంభంలో బంతి స్వింగ్ అవుతుంది.
లంకలో ఈ జట్లకు పండుగే!
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంకలో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. శ్రీలంక వేదికల్లో ఆతిథ్య జట్టుతోపాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, తదితర టీమ్‌లు ఆడుతున్నాయి. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే పిచ్‌లపై స్వదేశీ జట్టుగా శ్రీలంకకు సహజంగానే ప్రయోజనం ఉంటుంది. ఇక మేటి స్పిన్నర్లతో కూడిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు సత్తా చాటే అవకాశాలున్నాయి. కొలంబోలోని ప్రేమదాస, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్‌ఎ్‌ససీ) మైదానాలు, క్యాండీలోని పల్లెకెలె స్టేడియం పోటీలకు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ సహా 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు సెమీ్‌సకు, ఆపై తుదిపోరుకు చేరితేనే..సెమీఫైనల్-1తోపాటు టైటిల్ ఫైట్‌కు ప్రేమదాస స్టేడియం వేదికవుతుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక..కొండల నడుమ ప్రకృతి అందచందాలతో అలరారే పల్లెకెలె స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
పల్లెకెలె స్టేడియం (క్యాండీ):
సామర్థ్యం: 35 వేలు.
అత్యధిక స్కోరు: 263/3.
అత్యల్ప స్కోరు: 88
ఈ పిచ్ టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. మ్యాచ్ ప్రారంభంలో బౌన్స్‌కు అనుకూలిస్తుంది. బౌన్స్‌కు తగ్గట్టు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్లలో స్వేచ్ఛగా పరుగులు సాధించగలుగుతారు. రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి వికెట్ మందకొడిగా మారుతుంది. నికార్సయిన స్పిన్నర్లతోపాటు క్రమశిక్షణతో బౌలింగ్ చేసే పేసర్లు పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపుతారు.
ప్రేమదాస స్టేడియం, కొలంబో :
సామర్థ్యం: 35 వేలు.
అత్యధిక స్కోరు: 215/5
అత్యల్ప స్కోరు: 80
ఈ స్టేడియంలో సాధారణ స్కోర్లు నమోదవుతాయి. పిచ్ స్పిన్నర్లకు, సీమర్లకు అనుకూలిస్తుంది. వికెట్‌పై ఆరంభంలో బౌన్స్ ఉంటుంది.
ఎస్ఎస్సీ, కొలంబో:
సామర్థ్యం: 10 వేలు.
అత్యధిక స్కోరు:176/3
అత్యల్ప స్కోరు:140/6
శ్రీలంకలో ఇతర మైదానాలతో పోలిస్తే ఎస్ఎస్సీలో తక్కువ స్కోర్లు నమోదవుతాయి. క్రమశిక్షణతో బౌలింగ్, వ్యూహాత్మక షాట్లు.. కలగలిస్తే విజయం సాధ్యమే.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News