ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:19 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ముంబై వర్లిలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు....
ముంబై, ఫిబ్రవరి 7: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ముంబై వర్లిలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సల్మాన్‌తో పాటు దర్శకుడు సుభాష్ ఘాయ్, పాటల రచయిత ప్రసూన్ జోషి తదితర సినీ ప్రముఖులు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్‌తో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. మరోవైపు సంఘ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ఆ సంస్థ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. సంఘ్ ఎప్పుడూ అధికారం కోరుకోదని, అలాగే ఒత్తిడి చేసే బృందం కూడా కాదని, కేవలం సమాజ ఐక్యత కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యత లోపించడాన్ని గమనించే డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించారని భాగవత్ గుర్తు చేశారు. సమాజ ఐక్యత లక్ష్యం తప్ప ఆర్ఎస్ఎస్‌కు మరో అజెండా లేదన్నారు. బీజేపీ స్వతంత్ర రాజకీయ పార్టీ అని ఆర్ఎస్ఎస్‌కు అనుబంధ సంస్థ కాదన్నారు. ఆర్ఎస్ఎస్ కారణంగా మోదీ ప్రధాని అయ్యారని చాలామంది అనుకుంటారని, కానీ అది వాస్తవం కాదన్నారు.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్