బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:02 AM
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,600 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,43,550 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: వారం క్రితం బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,80,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. అయితే, ఊహించని విధంగా రెండు రోజులకే బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు బంగారం ధరలు..
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు (ఆదివారం) బంగారం ధరలు పెరగలేదు, తగ్గలేదు. నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,600 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,43,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలలాగే వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. నిన్న కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.28,500 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు కూడా కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర రూ.28,500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్ చంద్ర పోలీసు కస్టడీలో మృతి