Share News

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:53 AM

బంగ్లాదేశ్‌లో పలువురు అవామీ లీగ్‌ నేతలు పోలీసు కస్టడీలోనే మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశంలో పేరున్న హిందూ నేతల్లో ఒకరైన అవామీ లీగ్‌ నేత...

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్‌లో పలువురు అవామీ లీగ్‌ నేతలు పోలీసు కస్టడీలోనే మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశంలో పేరున్న హిందూ నేతల్లో ఒకరైన అవామీ లీగ్‌ నేత, మాజీమంత్రి రమేశ్‌ చంద్రసేన్‌(85) శనివారం పోలీసు కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రమేశ్‌ చంద్రసేన్‌ షేక్‌ హసీనా ప్రభుత్వంలో 2009-2014 వరకు బంగ్లాదేశ్‌ నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. దీనాజ్‌పూర్‌ జైలు నుంచి ఆయన్ను దీనాజ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీకి శనివారం ఉదయం 9.10 గంటలకు తీసుకురాగా 9.29కి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పలు ఆరోగ్య సమస్యలు ఉన్న ఆయనకు యూనస్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదని పేర్కొంటున్నారు. కాగా ఆయనపై హత్య కేసుతో సహా మరో రెండు కేసులు నమోదు చేశారు. పశువులను కట్టే తాళ్లతో ఆయన చేతుల్ని కట్టి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన దృశ్యాలు 2024 ఆగస్టులో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు అవామీ లీగ్‌ ముఖ్య నేతలు కస్టడీలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. రమేశ్‌ చంద్రసేన్‌ మృతిని కస్టోడియల్‌ హత్యగా పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తలూ చదవండి:

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 06:53 AM