Share News

‘గిన్నిస్‌’ పంతులమ్మ

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:10 PM

సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్‌ ప్రైస్‌ అనే బామ్మ.

 ‘గిన్నిస్‌’ పంతులమ్మ

సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్‌ ప్రైస్‌ అనే బామ్మ. ఏకధాటిగా 67 ఏళ్ల నుంచి ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నందుకుగాను ‘ప్రపంచంలో సుదీర్ఘకాలం సేవలందించిన భాషా ఉపాధ్యాయురాలిగా’ గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.


book9.2.jpgబెవర్లీకి చిన్నతనం నుంచి చదువంటే మహా ఇష్టం. అందుకే గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక, 1958లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ మొదలెట్టింది. పాఠాల్ని ఆర్ట్స్‌-క్రాఫ్ట్స్‌, నృత్య సంగీత రూపంలో, సైన్స్‌-సాంకేతికతను జోడిస్తూ... విభిన్నపద్ధతుల్లో ఆమె చేసే బోధన పిల్లల్ని తెగ ఆకట్టుకునేది. ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు, జీవితానుభవాలను బోధిస్తూ వారిలో స్ఫూర్తి కలిగిస్తుంటుంది.


దివంగత నటుడు రాబిన్‌ విలియమ్స్‌, మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బాల్మర్‌... ఈ టీచరమ్మ శిష్యులేనట. ‘ఉపాధ్యాయ వృత్తికోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తిగా’ బెవర్లీని గిన్నిస్‌ బుక్‌లో ప్రశంసించి రికార్డు సర్టిఫికేట్‌ అందజేసింది. ‘చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు.. అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం’ అంటోన్న ఈ టీచరమ్మ ఎంతైనా ఆదర్శనీయురాలే కదా.


ఈ వార్తలు కూడా చదవండి:

‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2026 | 01:10 PM