Share News

చరిత్ర సృష్టించేందుకు..

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:50 AM

టీ20 వరల్డ్‌కప్‌ను ఇప్పటిదాకా ఏ జట్టూ మూడుసార్లు గెలిచింది లేదు. అలాగే డిఫెండింగ్‌ చాంపియన్‌ టైటిల్‌నూ నిలబెట్టుకోలేదు. కానీ ఈ రెండు ఘనతలతో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం సూర్య సేన ముంగిట నిలిచింది.

చరిత్ర సృష్టించేందుకు..

టీ20 వరల్డ్‌కప్‌ను ఇప్పటిదాకా ఏ జట్టూ మూడుసార్లు గెలిచింది లేదు. అలాగే డిఫెండింగ్‌ చాంపియన్‌ టైటిల్‌నూ నిలబెట్టుకోలేదు. కానీ ఈ రెండు ఘనతలతో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం సూర్య సేన ముంగిట నిలిచింది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతుండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అందుకే ప్రస్తుతం భీకర ఫామ్‌తో ఉన్న భారత్‌ టైటిల్‌ను కాపాడుకోవడమే కాదు.. మూడోసారి విజేతగా నిలిచి చరిత్రకెక్కాలను కుంటోంది. అయితే ఈ ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు వరల్డ్‌కప్‌ అందుకోవడం అంత సులువేం కాదు. ఇప్పటివరకు అలా జరగలేదు కూడా. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌కు పాక్‌ మాత్రమే పోటీ ఇచ్చే అవకాశం ఉంది. యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ నామమాత్రపు జట్లే కాబట్టి.. సెమీస్‌ వరకు ఢోకా లేదనే చెప్పవచ్చు. మరి ఆశించినట్టుగా టీమిండియా ప్రయాణం సాఫీగా సాగుతుందా? జట్టులో సమస్యలేమైనా ఉన్నాయా? వంటి అంశాలపై ఓసారి వాటిపై లుక్కేద్దాం..


బ్యాటింగే బలంగా..: ప్రపంచకప్‌ల్లో భారత జట్టు ప్రధాన ఆయుధం బ్యాటింగే. ఓపెనింగ్‌ నుంచి చివరి వరకు విధ్వంసకర ఆటగాళ్లకు కొదవేలేదు. ప్రతీ బ్యాటర్‌కు మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. అలాగే అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్‌ను ఊహించని విధంగా మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. వీరి స్ట్రయిక్‌ రేట్‌ 150కి పైగా ఉండడం విశేషం. ముఖ్యంగా అభిషేక్‌ బాదుడు ఇతర జట్లకు వణుకు పుట్టిస్తోంది. దీనికితోడు కెప్టెన్‌ సూర్యకుమార్‌ కూడా ఫామ్‌ అందుకోవడం శుభసూచకం. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు. బంతిని బలంగా బాదే సామర్థ్యమే కాకుండా బంతితోనూ వికెట్లు తీయగల నైపుణ్యం ఉంది. ఇక రింకూ రాకతో ఫినిషింగ్‌ పదునెక్కింది. అలాగే బౌలింగ్‌ పరంగా కొత్త బంతితో లెఫ్టామ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌.. డెత్‌ ఓవర్లలో బుమ్రా యార్కర్లకు తోడు మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ మిస్టరీ బంతులకు ప్రత్యర్థి జట్ల వికెట్లు టపటపా నేలకూలాల్సిందే.


బలహీనత: భారత్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నట్టున్నా.. ఫాస్ట్‌ బౌలర్లలో అనుభవలేమి ఉంది. ఎందుకంటే హర్షిత్‌ రాణాకు ఇదే మొదటి వరల్డ్‌ కప్‌. తనను మూడో పేసర్‌గా తీసుకోవడం కాస్త రిస్క్‌గానే చెప్పాలి. అనుభవం కలిగిన పేసర్‌ కావాలనుకుంటే ముందే సిరాజ్‌ను తీసుకోవాల్సింది. మరోవైపు స్పిన్నర్‌ కుల్దీప్‌ పరుగులు ఎక్కువగా ఇచ్చుకోవడం ఆందోళనకరం. మునుపటిలా వికెట్లను కూడా పడగొట్టలేకపోతున్నాడు. అలాగే ఓపెనర్లు త్వరగా అవుటైతే మిడిలార్డర్‌ పుంజుకోవడం కష్టంగా మారుతోంది. ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో సమష్ఠి బ్యాటింగ్‌ ప్రదర్శన అత్యంత కీలకం. కొద్ది మందిపైనే ఆధారపడడం సముచితం అనిపించుకోదు.


book2.2.jpgడబ్బే డబ్బు...

ఈ ప్రపంచ కప్‌లో చాంపియన్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు డబ్బు కూడా భారీగానే దక్కనుంది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మనీ 20 శాతం పెరగడమే ఇందుకు కారణం. 2024లో టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 100 కోట్లు కాగా.. విజేతగా నిలిచిన టీమిండియా రూ. 20.42 కోట్లు అందుకుంది.

2026 టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ

టోర్నీ ప్రైజ్‌మనీ - రూ. 120.37 కోట్లు.

చాంపియన్‌కు - రూ. 27.48 కోట్లు.

న్నరప్‌నకు - రూ. 14.65 కోట్లు.

సెమీస్‌లో ఓడిన జట్టుకు - రూ. 7.23 కోట్లు.

5-12 స్థానాల్లో నిలిచిన ఒక్కో జట్టుకు - రూ. 3.48 కోట్లు.

13-20 స్థానాల్లో నిలిచిన ఒక్కో జట్టుకు (ప్రాతినిథ్య ఫీజు)- రూ. 2.28 కోట్లు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2026 | 09:18 AM