అమెజాన్‌లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంస్థ సీఈఓకు బహిరంగ లేఖ రాశారు. ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో ప్రస్తుతమున్న జాబ్స్‌లో 12 శాతం ఏఐతో భర్తీ చేయొచ్చని ఎమ్ఐటీ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 1.2 ట్రిలియన్ల వార్షిక ఆదాయం చెల్లించాల్సిన జాబ్స్ ఏఐతో భర్తీ చేయొచ్చని పరిశోధకులు తమ అధ్యయనంలో అంచనాకు వచ్చారు.
తమ తాజా ఏఐ మోడల్ జెమినై-3 విడుదల కోసం గూగుల్ ఇంజనీర్లు కంటి మీద కునుకు లేకుండా శ్రమించారని సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వాళ్లకు ప్రస్తుతం కాస్త నిద్ర అవసరమని సరదా వ్యాఖ్యలు చేశారు.
గూగుల్ మీట్లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు
ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఇది జనాల ముందుకు వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయట.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్కడి కంటెంట్ క్రియేటర్లు దేశాన్ని వీడే యోచనలో ఉన్నారు. టీనేజర్లు సోషల్ మీడియాకు దూరమైతే వ్యూస్, యాడ్స్‌పై వచ్చే ఆదాయం తగ్గుతుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాలంటే వాయిదా. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్‌గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.