Income Tax Dept Warns: ఆ లింక్ ఓపెన్ చేయకండి.. ప్రజలకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిక..
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:07 AM
సైబర్ నేరగాళ్లు ఈ పాన్ కార్డు పేరిట మోసాలకు తెరతీశారు. ఫిషింగ్ మెయిల్స్‌ను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు అవసరమైన వాటిని ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బులు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ వస్తున్న ఈ మెయిల్స్‌ను నమ్మి మోసపోకండని అంటోంది.
ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏముందంటే.. ‘ఈ పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండంటూ వస్తున్న ఫేక్ ఈ మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మేము ఈ మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరాలను అడగము. మీ ఆర్థిక, సున్నితమైన వివరాలను అడిగే ఎటువంటి ఈ మెయిల్స్, లింక్స్, కాల్స్, ఎస్‌ఎమ్ఎస్‌లకు మీరు స్పందించకండి. కొన్ని ఈ మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్స్‌లో ప్రమాదకరమైన వైరస్ ఉంటుంది. మీరు వాటిపై క్లిక్ చేసినపుడు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి వైరస్ చేరుతుంది.
యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, యాంటీ స్పై వేర్, ఫైర్‌వాల్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. కొన్ని ఫిషింగ్ ఈ మెయిల్స్‌లో మీ కంప్యూటర్‌ను హ్యాక్ చేసే సాఫ్ట్ వేర్ ఉంటుంది. యాంటీ వైరస్, యాంటీ స్పై వేర్ సాఫ్ట్‌వేర్, ఫైర్ వాల్‌లు మిమ్మల్ని ప్రమాదకరమైన ఫైల్స్‌నుంచి రక్షిస్తాయి. మీకు గనుక ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంటూ ఏదైనా ఈ మెయిల్ వస్తే ఆ ఈ మెయిల్ యూఆర్ఎల్‌ను webmanager@incometax.gov.in కు పంపండి. వీలైతే incident@cert-in.org.inకి కూడా పంపండి’ అని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
డయాబెటిస్ పేషంట్స్ ప్రతిరోజూ ఈ 3 పనులు చేయాలి..
ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల రివార్డు