Home » Income Tax Department
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి రిఫండ్ల విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి కారణాలను సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఎక్కువ మంది నుంచి పెద్ద మొత్తాల రిఫండ్ అభ్యర్ధనలు రావడం వల్ల కొంత ఆలస్యానికి కారణమవుతుందని..
ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈరోజు (సెప్టెంబర్ 15, 2025) లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, వాట్సాప్‌లో సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.
పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా. ఈరోజు సెప్టెంబర్ 15 చివరి తేదీ. అంటే రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేసేందుకు టైం ఉంది. ఇంకా ఫైల్ చేయని వాళ్లు వెంటనే చేసేయండి మరి.
పన్ను చెల్లింపు దారులకు కీలక సూచన. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 15, 2025 అంటే, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఆలస్యం చేస్తే మాత్రం జరిమానాలు తప్పవు.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతోంది. ఇంకా అనేక మంది రిటర్న్స్ ఫైల్ చేయలేదు. చాలామంది పన్ను చెల్లింపుదారులు గడువు మళ్లీ పొడిగిస్తారేమోనని ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
మీ సెలవులకి ప్లాన్ చేసే ముందు ఒక్కసారి ఐటీఆర్ ఫైలింగ్ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే దీని గడువు తేదీ సమీపిస్తోంది. టైంలోపు పక్కాగా ఫైల్ చేస్తే రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 15, 2025 వరకు మీ పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సిన ఆఖరి తేదీ. అయితే ఈ గడువు మిస్ అయితే ఏం చేయాలి, జరిమానాతో ఫైల్ చేయవచ్చా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఐటీఆర్ దాఖలు విషయంలో టెక్నికల్ గ్లిచ్‌లు, ITR ఫారాల యుటిలిటీల ఆలస్యం సహా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సీఏలు సహా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీని గడువు పొడిగించాలని కోరుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి ఏడాది లాగే, ఈసారి కూడా ఆదాయపు పన్ను (ITR) దాఖలుకు చివరి తేదీ దగ్గర పడుతోంది. గడువు సమీపించగానే డాక్యుమెంట్లు తెచ్చుకోవటం, లాగిన్ అవ్వటం… ఇదంతా చివరిదాకా వాయిదా వేసుకున్న వారికే టెన్షన్ ఉంటుంది. కానీ కొందరు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకుని, స్మార్ట్‌గా పన్నులను తగ్గించుకుంటారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.