Share News

ITR Deadline 2025: ఇప్పుడు చేయకపోతే జరిమానా తప్పదు.. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశారా లేదా

ABN , Publish Date - Sep 14 , 2025 | 08:39 AM

పన్ను చెల్లింపు దారులకు కీలక సూచన. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 15, 2025 అంటే, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఆలస్యం చేస్తే మాత్రం జరిమానాలు తప్పవు.

ITR Deadline 2025: ఇప్పుడు చేయకపోతే జరిమానా తప్పదు.. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశారా లేదా
ITR Deadline 2025 alert

పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 సమీపిస్తోంది. అంటే ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు ఆర్థిక సంవత్సరం 2024-25 (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) కోసం వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది పన్ను చెల్లింపు దారులు ఈ గడువు మరింత పొడిగించాలని కోరుతున్నారు.


ఎందుకు ఇంత ముఖ్యం?

ఈ తేదీలోపు ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల మీ జరిమానాలను తప్పించుకోవచ్చు, మీ రీఫండ్‌ త్వరగా వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ITRలు దాఖలు అయ్యాయి. అయితే, ఇంకా 35% రిటర్న్‌లు ప్రాసెస్ కావాల్సి ఉంది. ఇది పోర్టల్‌పై ఒత్తిడిని సూచిస్తుందని పలువురు అంటున్నారు.


మరోసారి పొడిగింపు

ఈ గడువు మొదట జూలై 31, 2025గా ఉండేది. కానీ ITR ఫారమ్‌లు, యుటిలిటీలలో ఆలస్యం, సాంకేతిక సమస్యల కారణంగా ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఇప్పుడు, ఈ గడువు కూడా సమీపిస్తున్నందున, చాలా మంది పన్ను చెల్లింపుదారులు మరోసారి పొడిగింపు కోసం ఆశిస్తున్నారు. కానీ, ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా మీ ITR ఫైల్ చేయడం బెస్ట్.


సాంకేతిక సమస్యలు

చాలా మంది పన్ను చెల్లింపుదారులు ITR e-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ.. పోర్టల్ సాధారణంగా పనిచేస్తోందని క్లారిటీ ఇచ్చింది. మీకు ఏదైనా సమస్య ఎదురైతే వేరే డివైస్‌లో ప్రయత్నించాలని తెలిపింది.

ఏది ఎంచుకోవాలి?

ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ పన్ను బాధ్యతను, మినహాయింపులను, డిడక్షన్‌లను ప్రభావితం చేస్తుంది.

పాత పన్ను విధానం

HRA, LTA, సెక్షన్ 80C (PF, ELSS, ఇన్సూరెన్స్), సెక్షన్ 80D (మెడికల్ ఇన్సూరెన్స్), హోమ్ లోన్ వడ్డీ వంటి మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ డిడక్షన్‌లు క్లెయిమ్ చేసే వారికి ఇది మంచి ఛాయిస్.

కొత్త పన్ను విధానం

తక్కువ పన్ను స్లాబ్‌లు, కానీ పైన పేర్కొన్న మినహాయింపులు/డిడక్షన్‌లు అందుబాటులో ఉండవు. ఈజీ ఫైలింగ్, తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది అనుకూలం.


  • గడువు మిస్ అయితే ఏమవుతుంది?

  • సెప్టెంబర్ 15 లోపు ITR దాఖలు చేయకపోతే, ఈ క్రింది నష్టాలు ఎదురవుతాయి

  • సెక్షన్ 234F కింద గరిష్టంగా రూ. 5,000 వరకు జరిమానా విధించబడవచ్చు

  • మీ రీఫండ్ చాలా ఆలస్యంగా వస్తుంది

  • పాత, కొత్త పన్ను విధానాల మధ్య మార్పు చేసే అవకాశం ఉండదు


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 08:39 AM