Jaismine Lamboria Wins: బాక్సింగ్‌లో భారత్‌కు గోల్డ్.. చరిత్ర సృష్టించిన జైస్మిన్ లాంబోరియా
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:34 AM
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత్‌కు చెందిన జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోలాండ్‌కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయం సాధించింది.
బాక్సింగ్ నుంచి మన దేశానికి గుడ్ న్యూస్ వచ్చింది. లివర్‌పూల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో (world boxing championship 2025) జైస్మిన్ లంబోరియా (jaismine lamboria) చరిత్ర సృష్టించింది. ఆమె మహిళల 57 కిలోల విభాగంలో పోలాండ్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత జూలియా సెరేమెతాతో పోరాడి గెలిచింది.
దాదాపు ఓటమి దగ్గర ఉన్న సమయంలో ఆమె చూపిన ఫైటింగ్ స్పిరిట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ బౌట్‌లో 4-1 స్ప్లిట్ డిసిషన్‌తో ఆమె గెలిచింది. ఈ గెలుపుతో జైస్మిన్ భారత్‌కు బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చింది.
శుభాకాంక్షల వెల్లువ
ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను, వరల్డ్ ఛాంపియన్ అయ్యానంటే చాలా ఆనందంగా ఉంది. పారిస్ 2024లో తొందరగా ఓడిన తర్వాత శారీరకంగా, మానసికంగా, టెక్నికల్‌గా బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ విజయం ఆ కష్టానికి ఫలితమని జైస్మిన్ పేర్కొంది. ఈ గెలుపు నేపథ్యంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా జైస్మిన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు.
పురుషుల విభాగంలో మాత్రం
ఇండియా నుంచి మహిళా బాక్సర్లు మెరిశారు. జైస్మిన్ స్వర్ణం సాధించగా, 80 కేజీల విభాగంలో నుపూర్ రజత పతకాన్ని, పూజా రాణి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కానీ పురుషుల విభాగంలో మాత్రం నిరాశ ఎదురైంది. 50 కేజీ విభాగంలో జడుమణి సింగ్ మాండెంగ్‌బాం, కజకిస్థాన్‌కు చెందిన ప్రపంచ చాంపియన్ సంజర్ టష్కెన్‌బే చేతిలో 0-4తో ఓడిపోయాడు. దీంతో ఈసారి భారత పురుషుల జట్టు మెడల్ లేకుండా ఇంటికెళ్లింది. ఇది 2013 తర్వాత మొదటిసారి కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి