Income Tax Return Due Date: ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది.. ఇప్పటివరకు ఎంతమంది ఫైల్ చేశారంటే
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:12 AM
ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతోంది. ఇంకా అనేక మంది రిటర్న్స్ ఫైల్ చేయలేదు. చాలామంది పన్ను చెల్లింపుదారులు గడువు మళ్లీ పొడిగిస్తారేమోనని ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. అయినా కూడా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ తమ రిటర్న్‌లను సమర్పించలేదు. ఇంకా టైమ్ ఉంది, గడువు పొడిగించొచ్చనే ఆశలతో ఉన్నారు. కానీ పొడిగింపు గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించిన ఐటీఆర్‌లను సెప్టెంబర్ 15, 2025లోపు ఫైల్ చేయాల్సి (Income Tax Return Due Date) ఉంటుంది.
ఫైన్స్ నుంచి
సమయం తక్కువగా ఉంది. చివరి నిమిషంలో తొందరపాటు, సైట్‌లో ట్రాఫిక్, టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా, వెంటనే ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభించండి. ఇది మీ పర్సనల్ ఫైనాన్స్ డిసిప్లిన్‌కు మాత్రమే కాదు. వడ్డీలు, జరిమానాల నుంచి తప్పించుకోవడానికీ ఉపయోగపడుతుంది. మొదట ఈ గడువు జూలై 31గా ఉండగా, మే నెలలో ప్రభుత్వం దీన్ని పొడిగించింది. కారణం? కొత్త ఐటీఆర్ (ITR) ఫారమ్‌లు, టెక్నికల్ సిస్టమ్ అప్‌డేట్స్ ఆలస్యం. కానీ ఇప్పుడు ఈ గడువుకు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఎందుకు ఇంకా ఫైల్ చేయలేదు?
పోర్టల్ సమస్యలు: ఐటీఆర్ వెబ్‌సైట్‌లో టెక్నికల్ గ్లిచెస్
రిఫండ్ ఆలస్యం: రిటర్న్స్ ప్రాసెసింగ్, రిఫండ్‌లలో జాప్యం
సమయం లేకపోవడం: చార్టెడ్ అకౌంటెంట్స్ (CAs) వద్ద పని ఒత్తిడి, సమయం కొరత
ఈ సమస్యల వల్ల చాలామంది గడువు మరింత పొడిగించాలని కోరుతున్నారు
ఇప్పటివరకు ఎంతమంది ఫైల్ చేశారు?
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్(income tax department) తాజా డేటా (సెప్టెంబర్ 10, 2025 వరకు) ప్రకారం 5 కోట్లకు పైగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. వీటిలో 4.63 కోట్లు ఈ-వెరిఫై కాగా, 3.35 కోట్లు ప్రాసెస్ అయ్యాయి. కానీ లక్ష్యం? 8 కోట్లు. దీని కోసం రోజుకు 54 లక్షల రిటర్న్స్ ఫైల్ కావాలి. కానీ సెప్టెంబర్ 10న కేవలం 16 లక్షలు మాత్రమే ఫైల్ అయ్యాయి. ఈ అంచనా ప్రకారం చూస్తే మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి