Aadhaar PAN Linking Guide: ఆధార్ - పాన్ లింకింగ్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:02 PM
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి ఓ డెడ్ లైన్ విధించింది. 2025, డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
మీరు మీ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయలేదా?.. మీ పాన్ కార్డులో తప్పులు సవరించుకోవాలా? అయితే ఇది మీ కోసమే. ఈ విషయాలు తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు. ట్యాక్స్‌లు కట్టే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి ఓ డెడ్ లైన్ విధించింది. 2025, డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. ట్యాక్సులు కట్టే విషయంలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆధార్ - పాన్ లింకింగ్ అవసరమా?
ఎవరైతే 2024, అక్టోబర్ 1వ తేదీకి ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉపయోగించి పాన్ కార్డు పొందారో వారు కచ్చితంగా ఆధార్ - పాన్ లింకింగ్ చేయాల్సిందే. ఒక వేళ ఆధార్ - పాన్ లింకింగ్ 2025, డిసెంబర్ 31వ తేదీలోగా చేయకపోతే వారి పాన్ కార్డు 2026, జనవరి 1వ తేదీనుంచి పని చేయకుండా పోతాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా, రీఫండ్స్ తీసుకోవాలన్నా, బ్యాంక్ లావాదేవీలు చేయాలన్నా సమస్య అవుతుంది. అందుకే ఎవరైతే 2024, అక్టోబర్ 1వ తేదీకి ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉపయోగించింది పాన్ కార్డు తీసుకున్నవారు గడువు తేదీలోగా ఆధార్ - పాన్ లింకింగ్ తప్పక చేయించుకోవాలి.
ఆన్‌లైన్ ద్వారా ఇలా సింపుల్‌గా ఆధార్ - పాన్ లింకింగ్
మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి. కొన్నిసార్లు పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.
క్విక్ లింక్ సెక్షన్‌లో ‘లింక్ ఆధార్’ సెలెక్ట్ చేసుకోండి.
మీ వివరాలను అక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్, పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. పేరు రెండిటిలో ఉన్నట్లుగా ఎంటర్ చేయండి.
ఓటీపీ వెరిఫికేషన్, పేమెంట్ చేసుకోండి.
పేమెంట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూడండి. పేమెంట్ పూర్తి అయిన తర్వాతే ఆధార్ - పాన్ లింకింగ్ ఆప్షన్ వస్తుంది.
పేమెంట్ పూర్తయిన తర్వాత లింక్ ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లి మరలా మీ వివరాలను నింపాలి. ఓ పాప్ అప్ వస్తుంది. దాన్ని కన్‌ఫార్మ్ చేయాలి. తర్వాత ‘యువర్ పేమెంట్ డీటేయిల్స్ ఆర్ వెరిఫైడ్’ అని వస్తుంది. తర్వాత కంటిన్యూ అని కొట్టండి.
ఆధార్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అగ్రీ అని కొట్టి ఆధార్ వివరాలు కన్‌ఫార్మ్ చేయాలి.
తర్వాత 6 సంఖ్యల ఓటీపీని ఎంటర్ చేయాలి. మీ ఆధార్ - పాన్ లింకింగ్ అయిపోతుంది.