Share News

Annual Returns: ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు గడువు పెంపు

ABN , Publish Date - Dec 31 , 2025 | 08:23 AM

ప్రతి ఏడాది ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Annual Returns: ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు గడువు పెంపు
Financial Reports Filing Extension

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన వివిధ రకాల ఆర్థిక నివేదికలు (Financial Reports), వార్షిక రిటర్న్ (Annual Returns) ల దాఖలు డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అయితే.. ఈ ఏడాది వార్షిక రిటర్న్‌లు దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) గుడ్ న్యూస్ చెబుతూ.. గడువు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి.


ఉత్తర్వుల ప్రకారం.. ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయడానికి జనవరి 31,2026 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ముగుస్తుంది. అయితే.. ఫైలింగ్ వ్యవస్థలో వస్తున్న టెక్నికల్ ఇబ్బందులు, పండుగలు, ఇతర సెలవుల వల్ల రిటన్న్‌లు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. వారి విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకొని, కంపెనీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్‌లను అదనపు రుసుము చెల్లించకుండా (Late fees) గడువు తేదీని పొడిగించాలని అధికారికంగా నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ

మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు

Read Latest National News

Updated Date - Dec 31 , 2025 | 09:25 AM