Foreign assets alert: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:12 PM
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి 25 వేల మందికి ఈ-మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ రూపంలో హెచ్చరికలు పంపనున్నట్లు తెలిపింది (taxpayer notice).
విదేశాల్లోని ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారికి ఈ నెల 28 నుంచి ఎస్‌ఎంస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్టు ఐటీ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్నవారు తమ ఐటీఆర్‌ని సవరించి డిసెంబర్ 31లోగా తిరిగి సమర్పించాల్సి వుంటుందని సూచించింది. అప్పటిలోగా చేయకపోతే చట్ట పరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించింది. ఇందుకోసం ఐటీ శాఖ పెద్ద సంస్థలను కూడా సంప్రదించి వారి ఉద్యోగుల జాబితాను సేకరించింది (IT department alert list).
గత ఆర్థిక సంవత్సరం 2024-25 లో 24, 678 మంది తమ ఐటీ రిటర్నులను సవరించి తిరిగి దాఖలు చేశారు (undisclosed foreign assets). వీరి విదేశీ ఆస్తులు రూ. 29,208 కోట్లుగా ఉన్నాయి. కాగా, తుది గడువు లోపు విదేశీ ఆస్తులను ప్రకటించని వారు నల్లధన నిరోధక చట్టం ప్రకారం, రూ. 10 లక్షల జరిమానా, 30 శాతం పన్ను, చెల్లించాల్సిన పన్నులో 300 శాతం వరకు అదనపు జరిమానాను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇవీ చదవండి:
వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి