Piramal Finance Gold Loans: త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:19 AM
పిరామల్ ఫైనాన్స్ లిమిటెడ్.. బంగారం రుణాల విభాగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు పిరామల్ ప్రధానంగా గృహ, ఎంఎ్‌సఎంఈ రంగాల కోసం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పిరామల్ ఫైనాన్స్ లిమిటెడ్.. బంగారం రుణాల విభాగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు పిరామల్ ప్రధానంగా గృహ, ఎంఎ్‌సఎంఈ రంగాల కోసం రుణాలను అందిస్తుండగా.. త్వరలోనే పసిడి రుణాల విభాగంలోకి ప్రవేశించనుందని సంస్థ సీఈఓ (రిటైల్ లెండింగ్) జగ్‌దీప్ మల్లారెడ్డి గురువారం నాడిక్కడ తెలిపారు. పిరామల్ ఫైనాన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 నగరాల్లో 517 శాఖలను నిర్వహిస్తోందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 50కి పైగా పట్టణాలు, నగరాల్లో 59 శాఖలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరు త్రైమాసికం ముగిసే నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.91,477 కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సంస్థ ఏయూఎం రూ.లక్ష కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగ్‌దీప్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News