Electric kettle in train: మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:58 PM
ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు అనేక సౌకర్యాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు రైల్వే నిబంధనలను ధిక్కరించి తప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకు దారి తీసింది.
మన దేశంలో కొన్ని కోట్ల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సు, విమాన ప్రయాణాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చవకగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు అనేక సౌకర్యాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు రైల్వే నిబంధనలను ధిక్కరించి తప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వీడియోపై రైల్వే శాఖ స్పందించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది (Indian Railways penalties).
@WokePandemic అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. రైలు సీటుపై కూర్చున్న ఒక మహిళ ఎలక్ట్రిక్ కెటిల్‌లో మ్యాగీని తయారు చేస్తోంది. కోచ్ పవర్ సాకెట్‌లో కెటిల్ ప్లగ్ పెట్టి వంట చేస్తోంది. ఈ ప్లగ్‌లు సాధారణంగా మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంత తక్కువ పవర్‌ను సప్లై చేసే సాకెట్‌లో ఆమె కెటిల్ ప్లగ్ ఉంచి వంట చేయడం రైల్వే శాఖ ఆగ్రహానికి కారణమైంది. ఆ వీడియోలోని వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది (railway safety rules).
'రైళ్ల లోపల ఎలక్ట్రానిక్ కెటిల్స్ ఉపయోగించడం ఖచ్చితంగా నిషేధం. ఇది సురక్షితం కాదు. చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరం. ఇది మంటలకు కారణమవుతుంది. ఇతర ప్రయాణీకులకు హానికరం కావచ్చు. ఇలా చేయడం రైలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించవచ్చు. షార్ట్ సర్క్యూట్‌కు కారణం కావచ్చు. ప్రయాణీకులు అలాంటి ప్రమాదకరమైన ప్రవర్తనకు దూరంగా ఉండాలి' అనే రైల్వే శాఖ సూచించింది (kettle use on train punishment).
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, ఇతర హై-వోల్టేజ్ ఉపకరణాలు రైళ్లలో ఉపయోగించకూడదు (railway fine). ప్రయాణీకుల భద్రత రీత్యా, మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ల్యాప్‌టాప్‌లు వంటి తక్కువ-వోల్టేజ్ పరికరాలను మాత్రమే రైలులో ఛార్జ్ చేయడానికి అనుమతి ఉంది. రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ లేదా హై-వోల్టేజ్ పరికరాలను ఆపరేట్ చేస్తూ పట్టుబడిన వారికి జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ రైలులో అగ్ని ప్రమాదానికి కారణమైతే భారీ జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..