Hippo attacks lions: వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:11 PM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అడవిలో హిప్పోపొటామస్‌కు, సింహాలకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అడవిలో హిప్పోపొటామస్‌కు, సింహాలకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Lions riverbank video).
badassanimals అనే రెడిట్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక నది ఒడ్డున కొన్ని సింహాలు కూర్చుని సేద తీరుతున్నాయి. ఆ నీటిలో ఒక భారీ హిప్పో నీటి అడుగు నుంచి ఈదుకుంటూ అక్కడకు వచ్చింది. సింహాలను చూసిన హిప్పో ఒక్కసారిగా ఒడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ భారీ హిప్పోను చూసిన సింహాలు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఆ సింహాలు చాలా భయపడినట్టు ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది (Wildlife viral video).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (hippo vs lions). వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. హిప్పోపొటామస్ బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శరీరం బరువు, బలం పరంగా సింహం కంటే హిప్పోపొటామస్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎంతటి క్రూర జంతువునైనా హిప్పోలు ధైర్యంగా ఎదుర్కోగలవు. అందుకే వాటిని చూసి సింహాలు, పులులు కూడా భయపడతాయి.
ఇవి కూడా చదవండి..
స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..