Amazing skill: స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:32 PM
కొన్ని వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (inspiring Amma skills).
@hariom5sharma అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక పెద్ద మట్టి పొయ్యి ముందు ఒక ముసలామె కూర్చుని దోశలు తయారు చేస్తోంది. ఆ పొయ్యి చుట్టూ మూడు వైపులా టేబుళ్లు ఉన్నాయి. వినియోగదారులు అక్కడ కూర్చుని సంతోషంగా తింటున్నారు. దోశలు కాలిన తర్వాత ఆ ముసలామె అక్కడి నుంచి కదలకుండానే దోశను గాలిలోకి విసిరి, అవసరమైన వ్యక్తికి అందిస్తోంది. ఆ దోశ నేరుగా వెళ్లి ప్లేట్‌లో పడుతోంది (viral Indian video).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Amma talent viral). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 14 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'స్విగ్గీ, జొమాటో 2020 లో ప్రారంభమయ్యాయి, వీరు అంతకు ముందు వ్యక్తులు' అని ఒకరు కామెంట్ చేశారు. ఇది ప్లేట్ డెలివరీ అని మరొకొరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..
ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..