Funny desi jugaad: ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:20 PM
చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది
మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (monkey problem desi solution).
adityasaloni2015 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో కోతుల సమస్య అనేది అందరినీ వెంటాడుతోంది. ఇంటి పైనే ఎదైనా ఎండబెట్టుకుంటే కోతులు పాడు చేస్తున్నాయి. ఈ సమస్యకు ఓ మహిళ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టింది. వాషింగ్ మెషిన్‌తో కోతుల సమస్యకు చెక్ పెట్టింది. ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను గోధుమలను ఆరబెట్టడానికి ఉపయోగించింది. ఆమె గోధుమలను ఒక వస్త్రంలో వేసి దానిని వాషింగ్ మెషిన్‌లో ఉంచి డ్రై చేసింది (amazing hack). దీంతో ఎండలో ఉంచాల్సిన పని లేకుండా గోధుమలు చాలా వరకు డ్రై అయిపోయాయి.
వాషింగ్ మెషిన్ ద్వారా గోధుమలను డ్రై చేయవచ్చనే ఆలోచన చాలా మందిని ఆకట్టుకుంటోంది (viral monkey hack). ఈ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు పదిహేను లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 1.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. రోటీ తిన్నప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాసన వస్తుందేమో అని ఒకరు కామెంట్ చేశారు. వాషింగ్ మెషిన్ శక్తులు దుర్వినియోగం అవుతున్నాయని ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి