Stock Market: వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:08 PM
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. గత రెండ్రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ సూచీలు శుక్రవారం నేల చూపులు చూశాయి.
గత రెండ్రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ సూచీలు శుక్రవారం నేల చూపులు చూశాయి. గురువారం విదేశీ మదుపర్లు 1, 225 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్ ప్రభావాన్ని చూపించింది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 720)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 50 పాయింట్ల లాభంతో మొదలైన ఉదయమంతా లాభనష్టాలతో దోబూచులాడింది. అయితే చివరి గంటల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల బాట పట్టింది. చివరకు సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 85, 706 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 12 పాయింట్ల నష్టంతో 26, 202 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్, వరుణ్ బేవరేజెస్, లారస్ ల్యాబ్స్, హిందుస్థాన్ జింక్, కల్యాణ్ జువెల్లర్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). గెయిల్ ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఏంజెల్ వన్, ఆస్ట్రాల్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 69 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.46గా ఉంది.
ఇవీ చదవండి: