ITR Filing Last Date: నేడు చివరి తేదీ..ఐటీఆర్ దాఖలు మిస్ అయితే మీకే నష్టం
ABN , Publish Date - Sep 15 , 2025 | 08:25 AM
పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా. ఈరోజు సెప్టెంబర్ 15 చివరి తేదీ. అంటే రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేసేందుకు టైం ఉంది. ఇంకా ఫైల్ చేయని వాళ్లు వెంటనే చేసేయండి మరి.
మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేశారా లేదా. ఎందుకంటే ఈ రోజు సెప్టెంబర్ 15, 2025 అసెస్‌మెంట్ ఇయర్ 2025-26 కోసం ITR ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ (ITR Filing 2025 Last Date). పెనాల్టీ లేకుండా ఫైల్ చేయాలంటే ఈ రోజు మీ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిందే. ఇంకా ఆలస్యం చేయొద్దు.
ఎందుకు ఇప్పుడే ఫైల్ చేయాలి?
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెప్పినట్టు, ఈ సారి డెడ్‌లైన్ జూలై 31 నుంచి ఆరు వారాలు పొడిగించారు. ఐటీఆర్ ఫారమ్‌లలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పటికే 6 కోట్ల మంది తమ రిటర్న్స్ ఫైల్ చేశారు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే పోర్టల్ హ్యాంగ్ అవ్వొచ్చు, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయండి.
ఫైలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి?
AIS (Annual Information Statement) మీ ఆదాయం, TDS, TCS, ప్రాపర్టీ డీటెయిల్స్, సేవింగ్స్ సహా ఇతర డాక్యుమెంట్స్ ఉండాలి
ఫారమ్ 16: మీ కంపెనీ ఇచ్చే ఈ ఫారమ్‌లో జీతం, TDS వివరాలు ఉంటాయి
హౌస్ రెంట్ రసీదు: రెంట్ చెల్లిస్తే HRA క్లెయిమ్ కోసం రసీదు తీసుకోవాలి
ఇన్వెస్ట్‌మెంట్ రసీదులు: ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా పేమెంట్స్ (ఇన్సూరెన్స్, డొనేషన్స్) చేసి ఉంటే ఆ రసీదులు ఉండాలి
ఐటీఆర్ ఫారమ్‌లకు అటాచ్‌మెంట్స్ అవసరం లేదు, కానీ డాక్యుమెంట్స్ మాత్రం రెడీగా ఉంచుకోండి
ఫారమ్ ఎలా ఎంచుకోవాలి?
మీ ఆదాయం రకం బట్టి సరైన ITR ఫారమ్ ఎంచుకోవాలి
ITR-1: జీతం, ఇతర ఆదాయంతోపాటు మొత్తం రూ.50 లక్షల లోపు ఉన్న వాళ్లకు ఇది బెస్ట్. డైరెక్టర్స్, విదేశీ ఆస్తులు ఉన్నవాళ్లకు ఇది వర్తించదు.
ITR-2: వ్యాపారం/ప్రొఫెషన్ ఆదాయం లేని వ్యక్తులు/HUFలకు
ITR-3: వ్యాపారం లేదా ప్రొఫెషన్ ఆదాయం ఉన్న వ్యక్తులు/HUFలకు
ITR-4: రూ. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలు, ఫర్మ్‌లు (LLP కాకుండా) బిజినెస్ ఆదాయం ఉన్నవాళ్లకు.
డెడ్‌లైన్ మిస్ అయితే ఏమవుతుంది?
ఈ రోజు డెడ్‌లైన్ మిస్ అయితే, మీ ఆదాయాన్ని బట్టి పెనాల్టీ, వడ్డీ కట్టాల్సి ఉంటుంది. గత ఏడాది (AY 2024-25)లో 7.28 కోట్ల మంది ITR ఫైల్ చేశారు, ఈ సారి కూడా సంఖ్య పెరగొచ్చు. కాబట్టి, ఇప్పుడే ఫైల్ చేసేయండి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి