Share News

Indian killed US Trump: అమెరికాలో భారతీయుడి హత్యపై ట్రంప్ ఆగ్రహం..అక్రమ వలసదారులకు వార్నింగ్

ABN , Publish Date - Sep 15 , 2025 | 07:38 AM

అమెరికా డాల్లాస్ నగరంలో భారతీయడు చంద్ర నాగమల్లయ్య హత్య ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమాయకుడైన చంద్రపై జరిగిన ఈ దాడి భారతీయ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.

Indian killed US Trump: అమెరికాలో భారతీయుడి హత్యపై ట్రంప్ ఆగ్రహం..అక్రమ వలసదారులకు వార్నింగ్
Indian killed US Trump

అమెరికా డాల్లాస్‌లో ఇటీవల ఓ భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్య (Indian man killed in US) ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సోషల్ ప్లాట్‌ఫామ్‌ ట్రూత్ వేదికగా తీవ్రంగా స్పందించారు. చంద్ర నాగమల్లయ్య ఒక గౌరవనీయ వ్యక్తి. అతన్ని ఒక అక్రమ వలసదారుడు, క్యూబా నుంచి వచ్చిన వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఇలాంటి వ్యక్తి మన దేశంలో ఉండకూడదని అన్నారు.


ఈ ఘటన సెప్టెంబర్ 10న డల్లాస్‌లోని ఒక మోటల్లో జరిగింది. 41 ఏళ్ల నాగమల్లయ్యను 37 ఏళ్ల మార్టినెజ్ అనే వ్యక్తి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై క్యాపిటల్ మర్డర్ అనే తీవ్ర నేరం కింద కేసు నమోదైంది. మార్టినెజ్, నాగమల్లయ్య తల నరికి, దాన్ని చెత్త బుట్టలో పడేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన చంద్ర భార్య, కొడుకు ఎదురుగానే జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


మార్టినెజ్ అనే వ్యక్తి గతంలో చిన్నారులపై లైంగిక దాడి, కారు చోరీ వంటి అనేక నేరాల్లో అరెస్టు అయ్యాడు. కానీ, బైడెన్ ప్రభుత్వం ఆయనను విడిచిపెట్టిందని ట్రంప్ ఆరోపించారు. ఎందుకంటే క్యూబా అతన్ని తిరిగి తీసుకోవడం తిరస్కరించిందన్నారు. ఇలాంటి అక్రమ వలసదారులకు మేము ఇకపై సడలింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అమెరికాను మళ్లీ సురక్షితంగా చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.


ఈ ఘటనపై అమెరికా హోంశాఖ (DHS) కూడా స్పందించింది. ఇది పూర్తిగా నివారించదగిన హత్య. ఆ వ్యక్తిని అమెరికాలో విడిచిపెట్టడం పెద్ద తప్పిదమని DHS అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మెక్లాఫ్లిన్ అన్నారు. మార్టినెజ్ గతంలో ఐసీఈ కస్టడీలో ఉన్నాడు. 2025 జనవరి 13న బైడెన్ పాలనలో ఓ పర్యవేక్షణ ఉత్తర్వు ద్వారా విడుదలయ్యాడు. అదే ఇప్పుడు విషాదానికి దారితీసిందని తెలిపింది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 07:40 AM