Share News

ITR Filing Deadline Extension: ఐటీఆర్ గడువు పొడిగించలేదు..అపోహలకు ఆదాయపు పన్ను శాఖ చెక్

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:27 AM

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈరోజు (సెప్టెంబర్ 15, 2025) లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, వాట్సాప్‌లో సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.

ITR Filing Deadline Extension: ఐటీఆర్ గడువు పొడిగించలేదు..అపోహలకు ఆదాయపు పన్ను శాఖ చెక్
ITR Filing Deadline Extension

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయాలనుకునే వారు ఇక ఆలస్యం చేయకండి. ఇప్పటికే గడువు తేదీగా సెప్టెంబర్ 15, 2025ను ఆదాయపు పన్ను శాఖ ఖరారు చేసింది (ITR filing deadline 2025). పలువురు పన్ను చెల్లింపుదారులు గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30, 2025 వరకు పొడిగించారని ఒక తప్పుడు విషయం వైరల్ అవుతోంది.


ఎలాంటి నిర్ణయం

ఆదాయపు పన్ను శాఖ ఈ పుకార్లను ఖండించి, పన్ను చెల్లింపు దారులు కేవలం అధికారిక ఖాతా @IncomeTaxIndia నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని (No extension for ITR filing) సూచించింది. ఇప్పటివరకు పొడిగింపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, వెంటనే మీ రిటర్న్‌ను ఫైల్ చేయాలని తెలిపింది. ఆలస్యం చేస్తే జరిమానాలు తప్పవు. మీ బాధ్యతగా మీ ఐటీఆర్‌ను సమయానికి సమర్పించి, పన్ను చెల్లింపుదారుగా నిలవాలని స్పష్టం చేసింది.


సహాయం కోసం 24x7 సపోర్ట్

ఆదాయపు పన్ను శాఖ సహాయం కోసం 24x7 హెల్ప్‌డెస్క్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్‌లు, వెబెక్స్ సెషన్‌లు, ట్విట్టర్/X ద్వారా సహాయం పొందవచ్చు. సెప్టెంబర్ 13, 2025 నాటికి 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి.

గడువు ముగిసిన తర్వాత జరిమానా

సెప్టెంబర్ 15 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే, సెక్షన్ 234F ప్రకారం రూ.5 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి రూ.5,000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.1,000 జరిమానా విధించబడుతుంది. డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్‌లు లేదా సవరించిన రిటర్న్‌లు ఫైల్ చేయవచ్చు. అదనంగా సెక్షన్ 234A ప్రకారం చెల్లించని పన్నుపై గడువు తేదీ నుంచి చెల్లింపు వరకు నెలకు 1% వడ్డీ వసూలు చేయబడుతుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 10:33 AM