Share News

PAN - Aadhaar: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..

ABN , Publish Date - Jan 01 , 2026 | 03:07 PM

ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్‌ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్‌ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

PAN - Aadhaar: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..
PAN Aadhaar link

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి ఆధార్-పాన్ కార్డులను లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డ్‌ నిష్క్రియాత్మకంగా మారుతుంది. అంటే పాన్ కార్డ్ పని చేయదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి, రిటర్న్‌లు క్లెయిమ్ చేయడానికి, ఇతర ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్‌ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్‌ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


నిర్ణీత గడువులోగా పాన్-ఆధార్ కార్డును లింక్ చేయలేదా? మరేం చింతించాల్సిన అవసరం లేదు. రూ. 1000 జరిమానాతో పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకునే వెసులుబాటును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అవకాశం కల్పించింది. తద్వారా మీ పాన్ కార్డును పునరుద్ధరించవచ్చు.

పాన్ కార్డ్ పని చేయదు..

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. జనవరి 1వ తేదీ నుంచి ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డును పని చేయవు. ఆధార్‌తో లింక్ చేసేంత వరకు పాన్ కార్డ్ నామమాత్రంగా ఉంటుంది. పన్నులు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలకు ఏమాత్రం పని చేయదు. పాన్‌ కార్డ్ పని చేయకపోతే.. ప్రజలు తమ సాధారణ ఆర్థిక, పన్ను సంబంధిత కార్యకలాపాలను నిర్వహంచడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ప్రభావితమయ్యే సేవలు ఇవే..

  • ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయలేరు.

  • ఆదాయపు పన్ను వాపసులను క్లెయిమ్ చేయలేరు.

  • బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, KYC ని పూర్తి చేయలేరు.

  • కొత్త బ్యాంకు అకౌంట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లు తెరవలేరు.

  • అధిక విలువైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరు.

  • అలాగే, లోన్స్, ఇతరత్రా సేవల విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


పన్ను మినహాయింపు కోల్పోవడం..

పాన్ కార్డ్ పనిచేయకపోతే పన్ను మినహాయింపులు రద్దయ్యే అవకాశం ఉంది. టీడీఎస్, టీసీఎస్‌పై అధిక రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే, జీతాల చెల్లింపు, వడ్డీలు, ఇతర పన్నులపై ప్రభావం చూపుతుంది.

ఫైన్‌తో లింక్ చేయొచ్చు..

గడువు దాటిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31వ తేదీ తరువాత కూడా రూ. 1000 ఆలస్య రుసుము చెల్లించి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయొచ్చు. లింకింగ్ ప్రాసెస్ పూర్తయిన తరువాత పాన్ కార్డ్ యధావిధంగా పని చేస్తుంది. ఆధార్-పాన్ కార్డ్ లింకింగ్ ప్రక్రియను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పూర్తి చేయొచ్చు.

ఎవరికి మినహాయింపు ఉంది?

స్థానికేతరులు, నిర్దేశించిన వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చిన కొన్ని వర్గాల వ్యక్తులు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవలసిన అవసరం లేదు.


Also Read:

After Party Chaos: ఆడ, మగ తేడా లేదు.. అందరూ తప్ప తాగి నడిరోడ్లపై..

AP GOVT: రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

Updated Date - Jan 01 , 2026 | 03:19 PM