Share News

After Party Chaos: ఆడ, మగ తేడా లేదు.. అందరూ తప్ప తాగి నడిరోడ్లపై..

ABN , Publish Date - Jan 01 , 2026 | 02:50 PM

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా మందు తాగి రచ్చ రచ్చ చేశారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగావ్‌లో నిన్న రాత్రి దారుణమైన పరిస్థితులు వెలుగు చూశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువతీ, యువకులు పెద్ద ఎత్తున మందు తాగి నడిరోడ్లపై రచ్చ రచ్చ చేశారు.

After Party Chaos: ఆడ, మగ తేడా లేదు.. అందరూ తప్ప తాగి నడిరోడ్లపై..
After Party Chaos

ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి భారత్ అత్యంత అద్భుతంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. జనం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే మద్యం ఏరులై పారింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా మందు తాగి రచ్చ రచ్చ చేశారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగావ్‌లో నిన్న రాత్రి దారుణమైన పరిస్థితులు వెలుగు చూశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువతీ, యువకులు పెద్ద ఎత్తున మందు తాగి నడిరోడ్లపై రచ్చ రచ్చ చేశారు.


రాత్రి వరకు పార్టీ చేసుకున్న కొంతమంది ఇళ్ల వరకు కూడా వెళ్లలేకపోయారు. నడి రోడ్డుపై పడిపోయారు. మరికొంతమంది స్నేహితుల సాయంతో నడవలేక నడుస్తూ ఇంటికి చేరుకున్నారు. నడిరోడ్లపై పడిపోయిన వారిని పైకి లేపి ఇంటికి పంపించటం పోలీసుల వల్ల కూడా కాలేదు. ప్రస్తుతం ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుమిత్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో.. ఓ వ్యక్తి ఫుట్‌పాత్ పక్కన పడిపోయి ఉన్నాడు. అతడికి రెండు వైపుల ఇద్దరు యువకులు నిల్చుని ఉన్నారు.


ఓ అమ్మాయి తాగి నడవలేని పరిస్థితిలో ఉంటే స్నేహితులు నడిపించి తీసుకెళుతూ ఉన్నారు. ఓ యువకుడు బాగా తాగి రోడ్డుపై పడి పోయి ఉన్నాడు. స్నేహితుడు అతడ్ని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓ చోట ఓ అమ్మాయి రోడ్డుపై పడిపోయి ఉంది. ఆమెను ఎంత పైకి లేపటానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా లేవటం లేదు. ఆ వీడియోలో మొత్తం ఇలాంటి దృశ్యాలే ఉన్నాయి. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దేశంలోని యువత ఇలా దారుణమైన స్థితిలో ఉంటే.. దేశం పరిస్థితి ఏమౌతుందో మీరే ఓ సారి ఆలోచించండి’..‘కొత్త సంవత్సరం రోజు మన బాగు కోసం కొత్త పనులు మొదలెట్టాలి. మనకు పనికి వచ్చే మంచి పనులు చేయాలి. ఇదే కదా మన పెద్దలు చెప్పింది. వీళ్లను చూస్తే చాలా బాధగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందా?

Updated Date - Jan 01 , 2026 | 02:57 PM