Peanuts Health Facts: వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
ABN , Publish Date - Jan 01 , 2026 | 02:10 PM
వేరుశెనగ ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా, సరైన సమయంలో తినాలి. అయితే, వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందని చాలా మంది అంటారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. చలికాలంలో ఎండలో కూర్చని వీటిని తినడం చాలా మందికి అలవాటు. ఇది మన దేశానికి చెందిన చవకైన, పోషకాలు గల ఆహారం. అయితే వేరుశెనగ తినడంపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది.. వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందని అంటారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందని నమ్ముతారు. కానీ నిపుణుల ప్రకారం ఇది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగడం వల్ల దగ్గు రావడం అనేది జరగదు. దగ్గుతో వాటికి ప్రత్యక్ష సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. వేరుశెనగలో కొవ్వు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వేరుశెనగ తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగితే కొందరికి అజీర్ణం, గ్యాస్, కడుపు భారంగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. వేరుశెనగ తిన్న తర్వాత కొంచెం దాహం వేయడం సహజం. కాబట్టి 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీరు తాగితే ఎలాంటి సమస్య ఉండదు.
వేరుశెనగ పోషకాలు
వేరుశెనగలు మంచి ప్రోటీన్‌కు మూలం. ఇవి కండరాలను బలపరుస్తాయి. అలాగే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, విటమిన్ B కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్నవారు మితంగా వేరుశెనగ తినవచ్చు.
సాధారణ తప్పులు
అధికంగా తినడం: ఎక్కువగా తింటే బరువు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చు.
వేరుశెనగను ఉప్పుతో ఎక్కువగా తినడం: ఎక్కువ ఉప్పు వల్ల రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఖాళీ కడుపుతో ఎక్కువగా తినడం: ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ వేరుశెనగ తింటే గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం లేదా బరువు పెరగవచ్చు.
వేరుశెనగ ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా, సరైన సమయంలో తినాలి. వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందన్నది అపోహ మాత్రమే. కొద్దిసేపటి తర్వాత నీరు తాగితే ఎలాంటి సమస్య ఉండదు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News