AP GOVT: రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jan 01 , 2026 | 02:24 PM
పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఆయా జిల్లాల వారీగా పాస్ పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది.
అమరావతి, జనవరి1 (ఆంధ్రజ్యోతి): పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(శుక్రవారం) నుంచి ఆయా జిల్లాల వారీగా పాసు పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ (AP Minister Anganai Satya Prasad) వెల్లడించారు. ఆ పాసు పుస్తకాల్లో తప్పులు ఉంటే ఇంటికి వచ్చి అధికారులు సరి చేస్తారని చెప్పుకొచ్చారు. రెవెన్యూ క్లినిక్‌లను అన్ని జిల్లాల్లో విస్తరించి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని వివరించారు. ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరంగా ఉంటుందని వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
22ఏ జాబితా నుంచి కొన్ని భూముల తొలగింపు: మంత్రి అనగాని సత్యప్రసాద్

2026వ సంవత్సరం ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు గైడెన్స్‌లో తాము ముందుకు వెళ్తామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని .. ఏపీని పున: నిర్మించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవ్వాలని ఆకాంక్షించారు. 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ సంతకం చేశానని ప్రస్తావించారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో తొలి సంతకం చేశానని తెలిపారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయించామని తెలిపారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఒక్కటిగా ఉన్న నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. స్వాతంత్య్ర సమర యోధుల భూములకు కూడా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని నిర్దేశించారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని స్పష్టం చేశారు. 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఏ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందని చెప్పుకొచ్చారు. అసైన్‌మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా చాలని స్పష్టం చేశారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఓకటి సరిపోతుందని వివరించారు. 8ఏ రిజిస్టర్లు, డికేటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు. దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ నుంచి తొలగించాలని మంత్రి అనగాని సత్య ప్రసాద్ సూచించారు.
ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యాజమానులను తిప్పుకోకూడదని ఆదేశించారు. నూతన సంవత్సరం బహుమతిగా భూయజమానులకు భారీ ఊరట ఇచ్చామని తెలిపారు. రైతులకు, భూ యాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. సూపర్ సిక్స్ గ్యారెంటీలను 18 నెలల్లో చాలా వరకు నెరవేర్చమని చెప్పుకొచ్చారు. అన్నివర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా చరిత్ర సృష్టించామని అన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించామని తెలిపారు. చరిత్రలో ట్రూ డౌన్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య 12 సార్లు విద్యుత్ ఛార్జ్‌లు పెంచారని గుర్తుచేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌లకు చెక్ పెట్టామని అన్నారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్‌పై అధ్యయనం చేస్తున్నామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..
Read Latest AP News And Telugu News