Home » Minister Anagani Satya Prasad
ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.
విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభపరిణామమని అభివర్ణించారు.
గత జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే.. ఫైన్‌ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందని ఆరోపించారు.
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
యువతలో ఉగ్రవాద తత్వాన్ని వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.
చిన్న, చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని అన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని, సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడతామని రెవెన్యూ..
అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రోత్సహించిందీ...
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడింది.