Minister Anagani: యువతలో ఉగ్ర తత్వాన్ని రెచ్చగొడుతున్న జగన్
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:00 AM
యువతలో ఉగ్రవాద తత్వాన్ని వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.
సీఎం చంద్రబాబు రాజనీతిజ్ఞుడు: మంత్రి అనగాని
హిందూపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘యువతలో ఉగ్రవాద తత్వాన్ని వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది. అభివృద్ధి 40 ఏళ్లు వెనక్కు వెళ్లింది. వైసీపీ నాయకుల దెబ్బకు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశాయి’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బుధవారం జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లేపాక్షి మండలం బిసలమానేపల్లిలో రచ్చబండ వద్ద ప్రసంగించారు. ‘సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఏడాదిలోపే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. మనం సీఎం భావి తరాల గురించి ఆలోచించే రాజనీతిజ్ఞుడు.’ అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.