Home » Jagan
బాబాయ్ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు జగన్ 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి పాలనలో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబు బీసీలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
2023లో కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం నియామక చట్టానికి మద్దతు పలికిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలని సరికొత్త డిమాండ్లు తెరపైకి తేవడం వెనుక..
ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారాలు చేస్తూ, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని, ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం 2023లో చేసిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.
ఇండి కూటమిలో ఉన్న సీపీఐతో కలసి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఒప్పందం చేసుకోవడం...
జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో చిన్నాన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి వైపు ఈడీ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఈయన తండ్రి. ఈ హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌పై లోతుగా కూపీ లాగిన ఈడీ అధికారులు ఏ-2 సునీల్ యాదవ్ నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం.
జగన్ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు, కల్తీ మద్యం వ్యవహారంపై ఈడీ, సర్వోన్నత న్యాయస్థానం, కేంద్రం లోతుగా విచారణ చేపట్టటంతో.. ఆ వ్యవహారాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా దారి మళ్ళించేందుకే.. జగన్ డీఎస్సీ అంశాన్ని తన ఉగ్రవాద తరహా దురాగతాలకు అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోమర్ మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్... తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయకపోగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో ఒకేసారి 15,941 మందికి ఉద్యోగాలు ఇస్తే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.