Share News

Pawan-Jagan: వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:38 AM

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల సైతం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. రాజకీయ విభేదాలు ఉన్నా మానవత్వం ముందు..

Pawan-Jagan: వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్
Pawan-Jagan

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పవన్ సందేశం ఇచ్చారు.


అటు, APCC చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. కాగా, నేడు (డిసెంబర్ 21న) వైఎస్ జగన్ తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minor Girl Harassed: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు.. ఇద్దరు యువకులు అరెస్ట్..

Special Cutout Erected: వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ కటౌట్.. చర్చకు దారి తీసిన కేసీఆర్,కేటీఆర్ ఫొటోలు..

Updated Date - Dec 21 , 2025 | 11:26 AM