Special Cutout Erected: వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ కటౌట్.. చర్చకు దారి తీసిన కేసీఆర్,కేటీఆర్ ఫొటోలు..
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:37 AM
వైఎస్ జగన్ బర్త్‌డే కటౌట్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఫొటోలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కటౌట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ బర్త్‌డే కటౌట్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఫొటోలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. శేరిలింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఈ కటౌన్‌ను ఏర్పాటు చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే జగనన్న’ అని కటౌట్‌పై ఉంది. రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టే.. వైఎస్ జగన్ పుట్టిన రోజు కటౌట్‌లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు వేశారంటూ జనం గుసగుసలాడుకుంటున్నారు.
బెడిసికొట్టిన బాలిక బుకే వీడియో
బెంగళూరుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్‌కు విమానంలో బాలిక పుష్పగుచ్ఛం అందించేలా వేసిన ‘బర్త్‌డే’ సెట్టింగ్ బెడిచికొట్టింది. జగన్ ఎక్కడకు వెళ్లినా, ఆఖరికి విమానం ఎక్కినా అభిమానులు చుట్టుముడుతున్నారని జనం బుర్రల్లోకి ఎక్కించేందుకు వైసీపీ సోషల్‌మీడియా చేసిన వీడియో, చివరకు జనం పరిహాసానికి గురయింది. ఇలాంటి సినిమాటిక్ వీడియోలతో తమ కళ్లు కప్పలేరంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు.. ఇద్దరు యువకులు అరెస్ట్..
స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...