Share News

Minor Girl Harassed: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు.. ఇద్దరు యువకులు అరెస్ట్..

ABN , Publish Date - Dec 21 , 2025 | 08:52 AM

ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించటం మొదలెట్టారు. ప్రేమించకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. చివరకు పాపం పండి జైలు పాలయ్యారు. పోలీసులు వారిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Minor Girl Harassed: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు.. ఇద్దరు యువకులు అరెస్ట్..
Minor Girl Harassed

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో కొంతమంది మగాళ్లు ఆడవాళ్లను వేధిస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. తాజాగా, పల్నాడు జిల్లాలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించటం మొదలెట్టారు. ప్రేమించకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కీచక యువకులు జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పల్నాడులోని సత్తెనపల్లికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.


ఆ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల కోటేశ్వరావు, 21 ఏళ్ల కోటయ్యల కన్నుపడింది. ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలెట్టారు. కోటేశ్వరావు అనే యువకుడు మరింత దారుణంగా ప్రవర్తించాడు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఇద్దరు యువకుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోసాగాయి. వారి టార్చర్ భరించలేకపోయిన బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కోటేశ్వరావు, కోటయ్యలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.


ఇవి కూడా చదవండి

స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...

ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...

Updated Date - Dec 21 , 2025 | 09:07 AM