Share News

Nara Lokesh Slams Jagan: జగన్‌కు చురకలంటించిన నారా లోకేశ్

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:49 PM

ముంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించింది. ఈ సమయంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించింది. దీంతో నష్టం కనిష్టంగా జరిగింది. ఈ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతు పరామర్శ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.

Nara Lokesh Slams Jagan: జగన్‌కు చురకలంటించిన నారా లోకేశ్

అమరావతి, నవంబర్ 04: ముంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను రైతు పరామర్శ యాత్ర పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పరామర్శ యాత్రపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ తన శైలిలో వ్యంగ్య బాణాలు సంధించారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే జగన్ గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారన్నారు. అయితే మీ వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారంటూ వైఎస్ జగన్‌కు నారా లోకేశ్ చురకలంటించారు.


తుపాన్ హెచ్చరిక వచ్చిన నాటి నుంచి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. అలాగే చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నామని పేర్కొన్నారు. అలా ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. ఇవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరంటూ నారా లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు. మీది వేరే భ్రమాలోకం.. అందులో విహరిస్తుంటే.. ఇవన్నీ తెలియవని జగన్‌కు తెలిపారు.


తనకు మహిళలంటే గౌరవమని.. అలాగే దేశమంటే భక్తి అని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లానన్నారు. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళామణులు వరల్డ్ కప్ గెలిస్తే.. తాను గెలిచినంతగా ఆనందించానని పేర్కొన్నారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే! అంటూ జగన్‌ వైఖరిని మంత్రి నారా లోకేశ్ ఎండగట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భకిశ్రద్ధలతో గంగాహారతి

అబద్దాలతో కాలం గడిపిన జగన్: దేవినేని ఉమా

For More AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 10:23 PM