kumaram bheem asifabad- భకిశ్రద్ధలతో గంగాహారతి
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:58 PM
పవిత్ర కార్తీక మాసం వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో మహిళలు గంగాహారతిని ఇచ్చిన దీపాలను వెలిగించారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. పంచపర్వాల సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి స్థానిక పెద్దవాగులో భక్తులు స్నానాలు ఆచరించారు. ఉపవాస దీక్షలు, దీపదా నాలు, తులసీ వివాహాలతో పట్టణంలో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్దవాగులో సాయంత్రం గంగాహారతి ఇచ్చి దీపాలను వదిలారు. ఆ
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పవిత్ర కార్తీక మాసం వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో మహిళలు గంగాహారతిని ఇచ్చిన దీపాలను వెలిగించారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. పంచపర్వాల సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి స్థానిక పెద్దవాగులో భక్తులు స్నానాలు ఆచరించారు. ఉపవాస దీక్షలు, దీపదా నాలు, తులసీ వివాహాలతో పట్టణంలో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్దవాగులో సాయంత్రం గంగాహారతి ఇచ్చి దీపాలను వదిలారు. ఆలయాలను దీపాలతో అలం కరించారు. బ్రాహ్మణవాడ కేశవనాథ ఆలయం, శివకేశవ ఆలయాల్లో కాగడహారతులతో పట్టణంలో భజనలు చేసుకుంటూ నగరసంకీర్తన చేపట్టారు. కార్తీక మాసం కావడంతో పండరినాథ నవరాత్రులను పురస్కరించుకుని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిర్పూర్(యు), ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలో కార్తీకమాసం సంద ర్భంగా మంగళవారం తులసీ వివాహం ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే మహిళలు మంగహారతులు పట్టి పసుపు కుంకుమలతో తులసి మంటపాన్ని సుందరంగా అలంకరించారు. సాయంత్రం పుణ్యకాలంలో పూజారుల మంత్రోచ్చారణల మధ్య తులసి అమ్మవారికి శాలిగ్రామ స్వామివారిని కలిపి వివాహ మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు పట్టి ప్రసాదం స్వీకరించారు. తులసి వివాహం అనంతరం కార్తీ దీపోత్సవం నిర్వహించి దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆత్రం ఆనంద్‌రావు, దేవరి ఆత్రం గంగారాం, కనక యశ్వంత్‌రావు, కనక ఆనంద్‌కుమార్, గోడం అమృత్‌రావు, కనక శ్యాంరావు, కనక వెంకటేశ్వర్, గోడం తూకారాం, కనక అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శివాలయంలో మహిళలు బిల్వ అర్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి బిల్వ పత్రాలతో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ దీపాలను వెలిగించారు.