Former MLC Budda Venkanna: రైతులపై జగన్ దండయాత్ర
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:33 AM
రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. పరామర్శ పేరుతో వారిపై దండయాత్రకు వెళ్లాడని మాజీ ఎమ్మెల్సీ...
తుఫాను తగ్గిన వారం తర్వాత షో: బుద్దా వెంకన్న
విజయవాడ (వన్‌టౌన్), నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. పరామర్శ పేరుతో వారిపై దండయాత్రకు వెళ్లాడని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘కృష్ణా జిల్లాలో రైతుల పరామర్శ అంటూ వెళ్లి పూలవర్షం కురుపించుకున్న ఏకైక నాయకుడు జగన్‌రెడ్డి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు పొలాల్లోకి దిగి రైతులను పరామర్శించారు. జగన్ మాత్రం ప్రధాన మార్గంలో షో చేస్తూ.. రైతులను పరామర్శించారు. తుఫాన్ రావటానికి వారం రోజుల ముందే బెంగళూరు పారిపోయి, తుఫాన్ తగ్గిన వారం రోజుల తరువాత రాష్ర్టానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించే హక్కు నైతికంగా కోల్పోయారు’ అని మండిపడ్డారు. జగన్ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లు కూడా లాక్కుంటారని హెచ్చరించారు. కాగా, విజయవాడ వరద సమయంలో జగన్ ప్రకటించిన కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడో సమాధానం చెప్పాలని బుద్దా ప్రశ్నించారు.