Share News

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..

ABN , Publish Date - Feb 06 , 2026 | 05:15 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడ ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు.

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..
Jagan Consolation Tour

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడ ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు. అయితే, ఉదయం నుంచీ జగన్ కోసం ఎదురు చూస్తూ ఓ కార్యకర్త, బైక్ స్టంట్ చేస్తూ మరో అభిమాని జగన్ యాత్రలో ప్రాణాలు కోల్పోయారు.


తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్.. నాలుగు గంటలైనా ఇబ్రహీంపట్నం చేరలేదు. ఉదయం నుంచీ జగన్ కోసం పడిగాపులు కాసిన వైసీపీ కార్యకర్త రాంబాబు పల్స్ డౌన్ కావడంతో.. ఇబ్రహీంపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద పడిపోయారు. వెంటనే గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అలాగే, ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్ అనే యువకుడు బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బారికేట్‌ను గుద్దుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కన్నుమూశాడు. భార్గవ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

కాగా, గతేడాది జూన్ లోనూ ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లిలో పర్యటించిన జగన్ కారు కిందపడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతిచెందాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ భారీగా జనాన్ని సమీకరించి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మరోవైపు ట్రాఫిక్, పోలీసు ఆంక్షలు విస్మరిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా.

Updated Date - Feb 06 , 2026 | 06:01 PM